మర్చి 28, 2024 గురువారం జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2024 తొమ్మిదో మ్యాచ్ లో భాగంగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిషబ్ పంత్ తో ఇద్దరు వికెట్ కీపర్ల సమరం జరగబోతుంది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్ లోకి అడుగుపెట్టనుంది. కెప్టెన్ శాంసన్ అజేయ అర్ధ సెంచరీతో వారి బ్యాటింగ్ తో ఫామ్ లోకి రాగా.. రియాన్ పరాగ్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. 194 పరుగులను డిఫెండింగ్ చేస్తూ, అవేష్ ఖాన్ మినహా రాజస్థాన్ రాయల్స్ ఉపయోగించిన బౌలర్లందరూ కనీసం ఒక వికెట్ తీశారు. అయితే, ఇక కొత్త బంతితో ట్రెంట్ బౌల్ట్ ఎలాగో మంచి శుభారంభాన్ని అందిస్తాడు.
Also read: MP Ganeshamurthi: టికెట్ రాలేదని ఆత్మహత్య చేసుకున్న ఎంపీ..!
ఇక మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో ఓడిపోవడంతో వారి ఈ ఐపీఎల్ సీజన్ గొప్పగా ప్రారంభం కాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బాటింగ్ కి వచ్చిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ యూనిట్ పరిమితం చేయలేకపోయింది, దింతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గేమ్ ను గెలుచుకుంది. ఇక నేడు రెండు టీమ్స్ ఆటగాళ్లు ఈ విధంగా ఉండొచ్చు.
Also read: Tirumala: తిరుమలలో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
రాజస్థాన్ రాయల్స్ (RR) చూస్తే.. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (C & WK), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ ఉండగా.., మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (సి & డబ్ల్యుకె), కుమార్ కుషాగ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్ లు ఉన్నారు.