Wasim Akram Wants Rohit Sharma To Play KKR in IPL 2025: ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 ఓటములతో అధికారికంగా ఎలిమినేట్ అయింది. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ సీజన్‌లో కేవలం బ్యాటర్‌గానే…
Hardik Pandya and Tilak Varma Rift: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచుల్లో 8 ఓడిపోయి అధికారికంగా ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా నిలిచింది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినందుకు ముంబై మేనేజ్మెంట్ భారీ మూల్యమే చెల్లించింది. హార్దిక్ సారథిగా మాత్రమే కాదు.. బ్యాటర్, బౌలర్‌గా విఫలమయ్యాడు. ప్రస్తుతం హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు ముంబై…
ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి.
సన్రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో నేడు (గురువారం) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7. 30 గంటలకు జరగనుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సూపర్ విక్టరీ సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ బ్యాటర్లు సునాయాసంగా చేధించారు. ఎస్ఆర్హెచ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. లక్నో బౌలర్లపై శివాలెత్తారు. ట్రావిస్ హెడ్ (89*), అభిషేక్ శర్మ (75*) పరుగులతో విరుచుకుపడ్డారు. కేవలం ఫోర్లు, సిక్సులతోనే లీడ్ చేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ 165 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సన్రైజర్స్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఆ తర్వాత బరిలోకి వచ్చిన ఆయుష్ బడోని లక్నో జట్టుకు ఆయువు పోశాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ కూడా రాణించాడు. దీంతో.. లక్నో ఎస్ఆర్హెచ్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన లక్నో.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య మ్యాచ్ ఉప్పల్ లో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మ్యాచ్‌ని చూసేందుకు ఉప్పల్ కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఉప్పల్ రూట్‌లో మెట్రో రైల్ తిరిగే సమయాన్ని పెంచింది . మెట్రో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం నాడు నిర్ణీత వేళలకు మించి మెట్రో రైళ్లు నడుస్తాయి. Also Read: T20 World Cup: క్రికెట్…