Mumbai Indians: ఎస్ఆర్హెచ్ దెబ్బకి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Playoffs Qualification Scenario: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై ఇండియన్స్ జట్టు నిష్క్రమించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య బుధవారం నాడు జరిగిన మ్యాచ్ ఫలితంతో హార్థిక్ పాండ్యా టీమ్ టాప్-4 ఆశలు ఆవిరైపోయాయి. లక్నోను హైదరాబాద్ చిత్తు ఓడించడంతో ఈ సీజన్‌లో ముంబై ప్రయాణం దాదాపు ముగిసినట్లైంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సేన విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడించింది.
Read Also: VD12 :విజయ్ దేవరకొండ బర్త్‌డే..స్పెషల్ అప్డేట్ వైరల్..
Also Read
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
దీంతో క్యాష్ రిచ్ లీగ్ 17వ ఎడిషన్‌లో ఏడో విజయం నమోదు చేసిన హైదరాబాద్ జట్టు.. మొత్తంగా 14 పాయింట్లు సాధించి.. నెట్ రన్‌రేటు(0.406)ని మెరుగుపరచుకుని పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. అలాగే, మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్ (రన్‌రేటు 1.453), రాజస్తాన్ రాయల్స్(రన్‌రేటు 0.476) 11 మ్యాచ్‌లు ఆడి చెరో 16 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెరో 12 పాయింట్లతో ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (రన్‌రేటు -0.316), లక్నో సూపర్ జెయింట్స్ (రన్‌రేటు -0.769) వచ్చే వారం పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించినా 14 పాయింట్లతో పైకి వెళ్లిపోతుంది.
Read Also: MayaOne : భారీ యాక్షన్ సన్నివేశాలతో వణుకుపుట్టిస్తున్న ‘మాయావన్ ‘ టీజర్…
అయితే, మరోవైపు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (11 మ్యాచ్‌లు- 8 పాయింట్స్, పంజాబ్ కింగ్స్(11 మ్యాచ్‌లు- 8 పాయింట్లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. అయితే, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పటికే 12 మ్యాచ్‌లలో కేవలం 4 గెలిచి 8 పాయింట్లతో ఉంది. ఇక, మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా మహా అయితే మొత్తంగా 12 పాయింట్లే వస్తాయి.. కాబట్టి టాప్-4లోకి ముంబై ఇండియన్స్ టీమ్ అడుగుపెట్టేందుకు అవకాశం లేదు. అలాగే, చివరి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఇంకో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్, రాజస్తాన్, సన్‌రైజర్స్ దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోగా.. ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించినట్లైంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!