ఐపీఎల్2023లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్ మన్ గిల్ ( 67 ) కీలక ఇన్సింగ్స్ ఆడాడు. అతడితో పాటు తెవాటియా ( 2బంతుల్లో 5) కీలక సమయంలో ఫోర్ కొట్టి గుజరాత్ కు విజయాన్ని అందించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటర్లలో షార్ట్ 36 పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు వికెట్లు, షమీ, జోషఫ్, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.
Read Also : IPL 2023 : సాహాను బ్లైండ్ గా నమ్మిన హార్థిక్
ఇక గుజరాత్ టైటాన్స్ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆ టీమ్ సారథి హార్థిక్ పాండ్యా మాత్రం తీవ్ర నిరాపరుస్తున్నాడు. గతేడాది అద్భుతంగా రాణించిన హార్థిక్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాటింగ్-బౌలింగ్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్యా.. 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి డగౌట్ కి వెళ్లాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్ లో మూడు మ్యాచ్ లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్థిక్ ను నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు.. నీ చెత్త బ్యాటింగ్ తో కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read Also : Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం