IPL 2022 : లక్నోపై బెంగళూరు ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2022 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్‌లో నువ్వా నేనా అనే విధంగా జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరిగింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో లక్నో సూపర్ జెయింట్ తలపడిందిం. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకోగా రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 96 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్ 23, షాబాజ్ అహ్మద్ 26 పరుగులు చేశారు. చివర్లో కార్తిక్ 8 బంతుల్లో 13 నాటౌట్‌గా మిగిలాడు. కాగా నాలుగు పరుగుల తేడాతో డుప్లెసిస్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. లక్నో బౌలర్లలో దుశ్మంత చమీర, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 32, దీపక్ హుడా 9 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 30 పరుగులు చేసిన కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. కృనాల్ పాండ్యా 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కేఎల్ రాహుల్ 30, స్టోయినిస్ 24 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, హర్షల్ పటేల్ 2, సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరొక ఒక వికెట్ తీశారు.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!