ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నేడు ముంబాయిలోని డీవై పాటేల్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచి సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన ఆశించిన మేరకు లేనప్పటికీ, ఈ మ్యాచ్‌పై మాత్రం ఊహకందని హైప్ నెలకొంది. అయితే ముంబై ఇండియన్స్ తరుఫున బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరోసారి నిరాపరిచి, డకౌట్‌గా వెనుదిరిగాడు.
సీఎస్‌కేకు పేసర్ ముఖేష్ చౌదరి అద్భుతమైన ఆరంభంతో ఒకే ఓవర్‌లో రోహిత్, ఇషాన్ కిషన్‌లను ఔట్ చేసిన రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 23 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ బ్రేవిస్ రూపంలో మూడో వికెట్‌ను చేజార్చుకోగ, 47 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసే సమయాని ముంబై ఇండియన్స్ స్కోరు 100/5 గా ఉంది.