Hyderabad Cybercrime Police: హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది. పోలీసుల ప్రకటనల ప్రకారం.. మోసగాళ్లు సోషల్ మీడియా, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ద్వారా అత్యధిక లాభాలు లేదా గ్యారంటీ ప్రాఫిట్లు ఇస్తామని చెప్పి బాధితులను ఆకర్షిస్తున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, ట్రేడింగ్ డాష్బోర్డులు, యాప్లు వాడి నకిలీ లాభాలు చూపిస్తూ మరిన్ని పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడతారు.
Cyber Fraud: విశాఖపట్నంలో డిజిటల్ మోసాలతో కోట్లు కాజేస్తున్న సైబర్ ముఠా అక్రమాలు బయటపడింది. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకున్న ఈ ముఠా, ఓ ప్రైవేట్ వైద్యుడిని టార్గెట్ చేసుకుని.. సుమారు రూ. 2.61 కోట్లను కాజేసింది.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.