కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు లైంగిక విద్య తరగతులను ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత మంత్రి మధు బంగారప్ప వెల్లడించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. గత శుక్రవారమే ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత లేకపోయినా లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాసనసభలో ప్రతిపక్ష నేత లేని నేపథ్యంలో లోకాయుక్త మెంబర్స్ సెలెక్షన్ కమిటీ కాంపోజిషన్స్ గురించి ఏపీ లోకాయుక్త అమెండ్‌మెంట్ బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం (Odisha Government) కూడా సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఒక రాష్ట్రంలో జరిగి.. మరొక రాష్ట్రంలో జరగడం లేదనేది లేదు.