పెండింగ్ దరఖాస్తులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్లైన్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు పట్టణ ప్రణాళికా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు.. మంత్రి నారాయణ ఆదేశాలతో దరఖాస్తుల…
నేడు ఏపీ కేబనెట్ భేటీ.. కీలక అజెండాపై చర్చ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక,…
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఇప్పటికే పలు సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్ విక్రయించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది.. ఈ రోజు ఆన్లైన్లో జనవరి నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లతో పాటు పలు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు..…