వారికి పవన్ కల్యాణ్ వార్నింగ్.. అనుమతులు ఉన్నా అడ్డు తగిలితే కఠిన చర్యలు..! అనుమతులు ఉన్న మైనింగ్ కు అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నిబంధనల ప్రకారం మైనింగ్ చేసే వారిని బెదిరిస్తున్నారన్నారు.. ఇలాంటి వైఖరి మంచిది కాదన్నారు… పుంగనూరు నియోజక వర్గం సదుంలో కొందరు నాయకుల ఆగడాలపై పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరి కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే.. మధ్యప్రదేవాసులు…
పేకాటకు అనుమతి ఇవ్వాలని పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు పేకాట అనుమతి కోసం పిటిషన్లు వేసిన మూడు క్లబ్‌లకు షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. 13 కార్డ్స్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్, లార్డ్ హోర్డింగ్ హాల్ టౌన్ క్లబ్, నర్సాపురం యూత్ క్లబ్.. అయితే, విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు.. డబ్బులు పందెంగా పెట్టి కార్డ్స్ ఆడటం చట్ట విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేస్తూ, క్లబ్‌ల…
ఇరుసుమండ బ్లోఅవుట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.. అయితే, బ్లోఅవుట్ ప్రాంతంలో గ్యాస్ లీక్‌ను అరికట్టడం, మంటలను నియంత్రించడం కోసం వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్, హోంమంత్రి వంగలపూడి అనిత సీఎంకు వివరించారు. బ్లోఅవుట్ ప్రాంతంలో ఇంకా మంటలు ఆరలేదు,…
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం.. ఒకరు మృతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఓ ప్రమాదం చోటు చేసుకుంది.. ఎయిరిండియా విమానాల లగేజీ హ్యాండ్లింగ్ పనుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సీకే ఆదిత్య ఆనంద్ (27).. ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం లగేజీని టెర్మినల్ నుంచి ట్రాలీల ద్వారా తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక…
అనుకూలించని వాతావారణం.. గాల్లో విమానం చక్కర్లు దట్టమైన పొగమంచు రవాణా వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతోంది.. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కారణంగా.. కొన్ని విమానాలు ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు మళ్లించిన విషయం విదితమే కాగా.. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకుండా పోయింది.. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్ పోర్టు (గన్నవరం) కు చేరుకోవాల్సిన విమానాలు వాతావరణం అనుకూలించకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి…
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరపనున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం.. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని వాదన.. రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ * ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ.. హైకోర్టు తీర్పును…
మాజీ ఎమ్మెల్యే భూ ఆక్రమణ.. లోకాయుక్త కోర్టు సీరియస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ భూ ఆక్రమణ ఆరోపణలపై లోకాయుక్త కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో జరిగిన ఈ భూ కబ్జా వ్యవహారం తాజాగా అధికారిక నివేదికలు, ఆధారాలతో మరో కీలక మలుపు తిరిగింది.. 2016లో మదనపల్లెలో మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు నిర్ధారితమైనట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారుల…