మహిళా దినోత్సవం.. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పనిగంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీ లో 15 వేల మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని, అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరం మార్చి 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి ఏడాది మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది స్త్రీ గొప్పతనాన్ని గౌరవించే ఓ సందర్భం.
Also Read: Kiara Advani : రెండేళ్లు సినిమాలకు దూరంగా స్టార్ హీరోయిన్..!
ఇక, ఈ ప్రపంచాన్ని సుందరంగా మార్చే ఓ మగువా త్యాగం, ప్రేమ, తపన అసమానమైనది. ఒక అమ్మగా, భార్యగా, చెల్లిగా, కూతురుగా ఆమె పోషించే ప్రతి పాత్ర వెనుక అంతులేని త్యాగం ఉంటుంది. ఓ తల్లి తన పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంది. ఓ భార్యగా కుటుంబాన్ని ఏకతాటిపై నిలపడానికి ఎల్ల వేళలా కృషి చేస్తుంది.. ఇక, చెల్లిగా అన్నదమ్ములకు తోడుగా నిలుస్తుంది.. ఇలా ప్రతి ఒక్క రూపంలో మహిళ సమాజానికి వెలకట్టలేని సేవ చేస్తుంది..
లేచింది మహిళా లోకం అనే పాటలో చెప్పినట్లుగానే ఇప్పుడు నిజంగానే మహిళా లోకం లేచింది.. సమానత్వం కోసం అడగాల్సిన అవసరం లేదు. సమానత్వం తప్పక కల్పించాల్సి వస్తుంది.. ఇంకా చెప్పాలంటే వారే ప్రధానంగా ఎదుగుతున్నారు. కొద్ది కాలంలోనే మాతృ స్వామ్యాన్ని మనం చూడబోతున్నాం.. కానీ, మారుతున్న కాలంతో పాటుగా మహిళాల ఆలోచన విధానం కూడా మారిపోతుంది.. అనిగి మనిగి ఉండే రోజులు పోయాయి. అత్తవారి ఇంటికి భయపడే రోజులు కూడా కనుమరుగైపోయాయి..
అత్తగారి ఇంటిని కూడా కోడాల్లే ఏలుతున్నారు. కానీ, ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం ఆడవారి లక్షణాల్లో అతి ముఖ్యమైన అలంకరణ అని చెప్పాలి. కాలంతో పాటుగా స్త్రీలో మార్పుల కారణంగా చాలా మంది తమ జీవితాన్ని కోల్పోతున్నారు. మహిళ తన సంపాదనతో తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనడంలో తప్పు లేదు.. కానీ, ఆ సంపాదించే ప్రమయంలో నేటి మహిళలు భర్తకి విలువ ఇవ్వడం తగ్గించేసింది. సమానంగా సంపాదిస్తున్నాను అనే గర్వం చూపిస్తూ చిన్న విషయాలకు కూడా సర్ధుకోలేక విడిపోతూ, సంసారాలను నాశనం చేసుకుంటున్నారు.
ఒకప్పుడు భర్త సంపాదిస్తే భార్య ఇంటిని నడిపేది.. అప్పుడు వారి ఇద్దరి మధ్య తెలియని ఒక అనుబంధం ఉండేది. భర్త వదిలేస్తే ఎలా బ్రతకాలి నా పిల్లలు ఏం అయిపోతారు అనే భయం ఉండేది.. కానీ, ఇప్పుడు అలాంటి కట్టుబట్లు మర్చిపోయారు. ఇద్దరు పిల్లలు ఉంటే తల ఇకరిన్ని పంచుకుని విడిపోతున్నారు. మహిళా తన సంపాదన తాను సంపాదించుకుంటే అంతకన్నా ఆనందం ఏం ఉంటుంది. కానీ కుటుంబం విషయంలో కూడా అంతే శ్రద్ధ వహించడం ముఖ్యం.
అందరూ అలాగే ఉంటున్నారు అని కాదు.. ఇద్దరు సంపాదిస్తే కానీ ఇల్లు గడవని రోజుల్లో బ్రతుకుతున్నారు. సంసారం ఈదడంలో ఇప్పటి మహిళ చాలా ఒత్తిడికి గురవుతుంది. ఇటు ఇంటిని చూసుకుంటు అటు ఉద్యోగం చేస్తూ చాలా స్ట్రేస్ ఫిల్ అవుతుంది. దాని ప్రతి ఒక మగవాడు గుర్తించాలి.. సమానంగా సంపాదిస్తున్నట్లే, ఇంటి పని విషయంలో, కుటుంబం పిల్లల విషయంలో సమానంగా పనులు పంచుకోవాలి.. అలాగే భర్తకు భార్య, భార్యకు భర్త పరస్పర గౌరవం ఇచ్చుపుచ్చుకున్నప్పుడే జీవితం పరిపూర్ణం అవుతుంది.