Amazon Launches Women’s Day Gifting Store: ‘మార్చి 8’ ప్రతి మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజున ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. సమాజంలో మహిళల పట్ల అవగాహన కల్పించేందుకు, మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, వారిని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రియమైన వారికి, అక్కా చెల్లెళ్లకు, స్నేహితులకు, జీవిత భాగస్వాములకు, సహోద్యోగినులకు చాలామంది బహుమతులు అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ గిఫ్టింగ్ స్టోర్‌ను ఆరంభించింది.
అమెజాన్ గిఫ్టింగ్ స్టోర్‌లో ధరలు రూ. 199 నుంచి ప్రారంభమవుతున్నాయి. మహిళలకు అవసరం అయ్యే ఎన్నో రకాల వస్తువులను స్టోర్‌లో అమెజాన్ అందుబాటులో ఉంచింది. కిరాణా, హ్యాంపర్‌లు, గౌర్మెట్ బహుమతులు, వ్యక్తిగత సంరక్షణ, ఎలక్ట్రానిక్స్, గృహ మరియు వంటగది ఉపకరణాలు, ఫర్నిషింగ్ మరియు డెకర్ వంటి విభాగాలలో ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. చిరు వ్యాపారులకు, పెద్ద ఎత్తున బహుమతులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ స్టోర్ బాగా ఉపయోగపడనుంది.
Also Read: IND vs ENG Test: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ ఐదో టెస్టు.. అశ్విన్, బెయిర్‌స్టోకు ప్రత్యేకం!
టెలివిజన్, స్పీకర్లు, కెమెరాల వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులపై 75% వరకు అమెజాన్ తగ్గింపు అందిస్తోంది. రూ. 4,848కే ఫుట్ మసాజర్ మెషిన్ అందుబాటులో ఉంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వంటి వాటిపై 65% వరకు తగ్గింపు లభిస్తోంది. రూ. 2996కే కేరీన్‌హాన్స్ టెక్నాలజీతో ఫిలిప్స్ హెయిర్ స్ట్రెయిట్‌నర్ బ్రష్‌ను, హీట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో హావెల్స్ ఫోల్డబుల్ హెయిర్ డ్రైయర్‌ను రూ. 999కే కొనుగోలు చేయొచ్చు. హెయిర్ కర్లర్‌లు రూ. 902 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1199కే కొనుగోలు చేయొచ్చు. ఇలా మరెన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.