Google Doodle: మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. మహిళా దినోత్సవాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రతిబింబిచేలా గూగుల్ డూడుల్ ను రూపొందించింది. మహిళలు తమ దైనందిక జీవితంలో వారు పోషించే పాత్రను ఈ డూడుల్ లో అద్భుతంగా తెలియజేసింది గూగుల్.
Read Also: India wheat To Afghanista: ఆఫ్ఘన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమలు.. ఉదారత చాటుకున్న భారత్
ఈ డూడుల్ లో మహిళలు వారి హక్కుల కోసం పోరాడటం, సైన్స్, వైద్య రంగాల్లో మహిళ పాత్ర, ఓ తల్లిగా ఆమె బాధ్యతలను నిర్వర్తిస్తుండటం డూడుల్ లో చూడవచ్చు. ఈ డూడుల్ థీమ్ లక్ష్యం మహిళలకు మద్దతు ఇవ్వడమని, నా జీవితంలో ఇతర మహిళలు నాకు మద్దతు ఇచ్చిన అన్ని మార్గాలను ప్రతిబింబిస్తూ చాలా సమయం గడిపానని ఈ డూడుల్ ను రూపొందించిన కళాకారిణి అలిస్సా వినాన్స్ అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళా సాధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను గుర్తించేందుకు, వారిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.