హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని దక్షిణ నగరమైన కరాచీలో ఆదివారం నిరసన ప్రదర్శన జరిగింది. అయితే కొద్దిసేపటికే నిరసన హింసాత్మకంగా మారింది. చాలా మంది ప్రజలు రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరూట్‌లోని నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తోంది. తొలిసారిగా బీరుట్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బీరుట్ శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్‌లో కూడా ఇజ్రాయెలీ డ్రోన్‌లు కనిపించాయి.
Israel Attacks On Lebanon: లెబనాన్‌లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇటీవల వైమానిక దాడులు, కమ్యూనికేషన్ పరికరాల్లో పేలుళ్ల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారతప్రజల ఆందోళన కూడా పెరిగింది. ఈ సంఘటనల తరువాత, బీరూట్ లోని భారత రాయబార కార్యాలయం తదుపరి నోటీసు వచ్చే వరకు లెబనాన్‌కు వెళ్లకుండా సలహాలను జారీ చేసింది. అంతేకాదు, ఎవరైనా భారత పౌరులు ఉంటే వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.…