ముద్దు అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎవరైనా ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దు పెడుతుంటారు. తల్లీ బిడ్డల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ముద్దు అనేది అన్యోన్యతను పెంచే సాధనం. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, వ్యక్తుల సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ప్రతి ఏడాది జూలై 6వ తేదీన అంతర్జాతీయ ముద్దు దినోత్సవం నిర్వహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం 2000లో…