విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానికి సంబంధించిన దేవాదాయ భూముల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. దేవాదాయ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది.. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించింది.. అందులో తోలిన గ్రావెల్, మట్టి, కంకరలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది.. అంతేకాదు, ఆ భూములను యథాస్థితికి తీసుకు రావాలని ఆదేశించింది..
Group 1 : తెలంగాణలో గ్రూపు-1 నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. గ్రూపు-1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ 20 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం కోర్టు విచారణ ప్రారంభించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు నియామక పత్రాలు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఇటీవల,…
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి మార్పు చేయవద్దని.. వక్ఫ్ ,వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై…
అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపిన ఏపీ హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై.. ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ…