Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
Honour killing: మరో పరువు హత్యకు 20 ఏళ్ల యువతి బలైంది. కులాంత సంబంధం పెట్టుకుందని 20 ఏళ్ల కూతురిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈఘటన కర్ణాటకలోని దేవనహళ్లీ తాలూకాలోని బిదలూర్ గ్రామంలో బుధవారం జరిగింది. దళిత వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందకు కూతురుని హత్య చేశాడు. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ, మారకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు.