తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేసింది.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం అధికంగా నమోదైంది. మొత్తం మీద ఫస్టియర్, సెకండియర్ కలిపి 65.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంతో పోలిస్తే… రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత ఎక్కువగా ఉంది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,07,787 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 5,91,836 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 63.32శాతం, సెకండియర్‌లో 67.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మీద బాలికల ఉత్తీర్ణత 73.80 శాతంగా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత 56.73 శాతంగా నమోదైంది.