ఆరోగ్య బీమా క్లెయిమ్ తిరస్కరణకు గురైతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిన వెంటనే ఆందోళనకు గురికాకుండా, ముందుగా ఎందుకు తిరస్కరించారో స్పష్టంగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఇందుకోసం మీ బీమా పాలసీ పత్రాలు, నిబంధనలు, అలాగే వైద్య నివేదికలను జాగ్రత్తగా పరిశీలించాలి. క్లెయిమ్ తిరస్కరణకు గల కారణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా, మీ పాలసీ కవర్ చేసే వ్యాధుల జాబితాలో మీకు వచ్చిన అనారోగ్యం…