Infosys: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించడనికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
నారాయణమూర్తి పని రోజుల కంటే సమర్థతపై దృష్టి పెట్టాలని కార్తీ చిదంబరం తెలిపారు. మన రోజువారీ జీవితం ఒక పోరాటంలా కొనసాగుతుంది.. మంచి సామాజిక, సామరస్య పరిస్థితుల కోసం వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.
Indian Techie: భారతదేశంలోని ఓ స్టార్టప్ కంపెనీలో తాను వర్క్ చేస్తున్నానని.. తనను జాబ్ లోకి తీసుకున్నాక సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు.. అలాగే, రోజూ దాదాపుగా 12 నుంచి 15 గంటల పాటు పని చేయాల్సి వస్తోందని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వాపోయాడు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో విలాస వంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రూ. 50 కోట్ల విలువైన ఈ విలాసవంతమైన ఫ్లాట్, ఈ ప్రాంతంలోని నివాస ప్రాపర్టీ ధరలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందట. చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం. ఈ భవనంలోని పదహారవ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు…
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో…
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం కాగ్నిజెంట్ ఇన్ఫోసిస్‌పై దావా వేసింది. ఇన్ఫోసిస్ తన హెల్త్ టెక్ అనుబంధ సంస్థ ట్రిజెటోకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపించింది.
పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది.
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించాలని ఇన్ఫోసిస్‌కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేశారు.
చైనాను వదిలిపెట్టి భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారడం అంత సులువు కాదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. 'ELCIA టెక్ సమ్మిట్ 2024'లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం చైనా తయారీ సామర్థ్యంతో భారత్ పోటీపలేదని స్పష్టం చేశారు.
ఆమె రాజ్యసభకు ఇటీవల రాజ్యసభలో అడుగు పెట్టారు. ఇది ఆమె మొదటి ప్రసంగం.. తొలిసారి మాట్లాడేందుకు తడబడ్డారు.. రాజ్యసభ విధానం తెలియకున్నా.. తాను చెప్పాల్సిన అంశాలను క్లుప్తంగా వివరించారు.