ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 32 వేల కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించాలని ఇన్ఫోసిస్‌కు జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేశారు. నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్ పై పన్ను ఎగవేత కేసు నమోదైనట్లు సమాచారం. జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది.
READ MORE: Telangana Assembly 2024: ఇవాళ అసెంబ్లీలో మూడు బిల్లులపై చర్చ.. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం..
కాగా.. కంపెనీ ఈ నోటీసును ప్రీ-షో కాజ్ నోటీసుగా పేర్కొంది. అటువంటి ఖర్చులపై జీఎస్టీ వర్తించదని వివరణ ఇచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీకి లోబడి ఉండవని ఇన్ఫోసిస్ తెలిపింది. జీఎస్టీ చెల్లింపు అనేది ఐటీ సేవల ఎగుమతికి వ్యతిరేకంగా క్రెడిట్ లేదా వాపసు కోసమని చెప్పింది. జీఎస్టీ బకాయిలన్నీ చెల్లించామని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని కంపెనీ తెలిపింది.
READ MORE:Puri Jagannath: ఎటూ తెగని డబుల్ ఇస్మార్ట్ పంచాయతీ..రంగంలోకి పూరి, ఛార్మి..
జీఎస్టీ అధికారులు ఇన్ఫోసిస్‌కు పంపిన పన్ను పత్రంలో కంపెనీ విదేశీ శాఖల నుంచి పొందిన సేవలపై పన్ను చెల్లించలేదని పేర్కొంది. అందువల్ల భారతదేశం వెలుపల ఉన్న శాఖల నుంచి స్వీకరించబడిన సరఫరాలపై ఇన్ఫోసిస్ రివర్స్ ఛార్జీని ఎదుర్కొంటోంది. యంత్రాంగం కింద రూ.32,403 కోట్లు చెల్లించాల్సి ఉంది.