ఇన్ఫోసిస్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య మొత్తం ఐటీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కంపెనీ తన ట్రైనీ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించింది. కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ నుంచి 400 మంది ట్రైనీ ఇంజనీర్లను తొలగించింది. కంపెనీ ఈ ఆఫర్ లెటర్‌లను సైతం పంపింది. ఇది మాత్రమే కాదు.. కంపెనీ ఈ ఉద్యోగుల ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ట్రైనీలుగా చేరిన వారిలో కూడా సగం మందిపై వేటు పడినట్లు సమాచారం.
READ MORE: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
ఈ ట్రైనీ ఇంజనీర్లు వరుసగా నిర్వహించిన మూడు ఎవాల్యుయేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని, అందుకే తొలగించినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందింది. కానీ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తొలగించిన వారందరినీ సిస్టమ్ ఇంజనీర్స్ (SE), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్స్ (DSE) పోస్టులకు నియమించారు. ఈ సందర్భంగా పలువురు ట్రైనీ ఇంజనీర్లు స్పందించారు. ” ఈ పరీక్షలు చాలా కఠినమైనవి. మమ్మల్ని ఫెయిల్ చేయడానికి కావాలనే ఈ పరీక్షలను పెట్టారు. ఇప్పుడు మా భవిష్యత్తు అంధకారంగా మారింది.” అని పేర్కొన్నారు. శిక్షణ పొందినవారు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చూసుకోవడానికి కంపెనీ బౌన్సర్లు, భద్రతా సిబ్బందిని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. తొలగించిన వాళ్లు సాయంత్రం 6 గంటలలోపు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అధికారికం ఫిర్యాదు చేస్తామని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) తెలిపింది
READ MORE: West Bengal : బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు సజీవ దహనం
కాగా.. 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను కంపెనీ తీసుకుంది. సిస్టమ్ ఇంజినీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ పోస్టులను కేటాయిస్తూ.. ఆఫర్ లెటర్లు సైతం ఇచ్చింది. వారు 2022లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న వాళ్లు. వీళ్లను విధుల్లోకి తీసుకోవడంతో జాప్యం చేస్తూ వచ్చిన కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కార్మిక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చేసేదేమీ లేక కంపెనీ 2024 ఏప్రిల్‌లో వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంది.