హీరోగా కొంతకాలంగా వెనకబడిన వరుణ్ సందేశ్ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని నింపుకుని, కొత్త సంవత్సరం తొలి రోజున ‘ఇందువదన’ మూవీతో జనం ముందుకు వచ్చాడు. మాధవి ఆదుర్తి నిర్మించిన ఈ హారర్ కామెడీ మూవీని ఎం. శ్రీనివాసరాజు డైరెక్ట్ చేశారు. వాసు (వరుణ్ సందేశ్) ఓ ఫారెస్ట్ ఆఫీసర్. అతనికి గిరిజన తండాకు చెందిన ఇందు (ఫర్నాజ్ శెట్టి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలి చూపులోని ప్రేమలో పడిన వీరిద్దరూ గూడెం కట్టుబాట్లను కాదని మనువాడతారు. భార్యను తనతో…
యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇందువదన’. గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ మేకోవర్ తో వరుణ్ సందేశ్ ఈ మూవీతో జనం ముందుకు రాబోతున్నాడు. మధ్యలో భార్యతో కలిసి బిగ్ బాస్ సీజన్ 3 లోనూ పాల్గొన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కొన్ని చిత్రాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి సైతం వెనుకాడని వరుణ్ సందేశ్ ‘ఇందువదన’లో మాత్రం హీరోగానే నటించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్,…
హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది.…
‘వేర్ ఈజ్ వరుణ్ సందేశ్?’ అంటూ రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ‘ఇందువదన’ చిత్ర బృదం ఓ వీడియోను విడుదల చేసింది. వరుణ్ సందేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని అందులో చెప్పింది. దానికి తగ్గట్టుగా సోమవారం ఉదయం ‘ఇందువదన’ పోస్టర్ ను విడుదల చేశారు. విశేషం ఏమంటే… ఈ బోల్డ్ పోస్టర్ విడుదల అయ్యీ కాగానే సోషల్ మీడియాలో వైరల్ కావడం మొదలైంది. షర్ట్ లేకుండా వరుణ్ సందేశ్,…