హీరో వరుణ్ సందేశ్ లాంగ్ గ్యాప్ తర్వాత ఎమ్మెస్సార్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి గిరిజన యువతిగా నటిస్తున్నారు. ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘వడివడిగా సుడిగాలిలా వచ్చి .. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా’ అంటూ ఈ సాంగ్ సాగుతోంది. ఓ సెలయేటి ఒడ్డున ఈ పాటను అందంగా చిత్రీకరించారు. శివ కాకాని సంగీతాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ & మాళవిక ఆలపించారు.