ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఆషాడమాసం సారె ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు వైదిక కమిటీ సభ్యుల చేతుల మీదుగా అమ్మవారికి ఆషాడ మాసం సారె సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బెజవాడ కనకదుర్గ దేవికి నగరం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారికి వైదిక కమిటీ సభ్యులు సారెను సమర్పించుకున్నారు.