Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టేందుకు నిరాకరించిందనే కోపంతో హిందూ యువతిపై ముస్లిం అత్తామామలు దాడికి పాల్పడ్డారు. తన బిడ్డకు ఇస్లామిక్ పేరు పెట్టడానికి నిరాకరించినందుకు భర్త తన స్నేహితులతో తనపై అత్యాచారానికి కుట్ర పన్నినట్లు, చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది.
మధ్య భారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాల్లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లాలో చాలా విశాలమైనది. ప్రస్తుతం.. శంకర్ లాల్వానీ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు.
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. ఇండోర్ కు చెందిన 28 ఏళ్ల వ్యక్తికి 2021లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వైభవ్ శుక్లా అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త విపరీతమైన ప్రేమగా మారింది. అయితే వైభవ్.. ఆ యువకుడిని సెక్స్ చేంజ్ ఆపరేషన్ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అలా అయితే సమాజంలో గౌరవంగా జీవించవచ్చని ఆ యువకుడికి చెప్పాడు. దీంతో బాధితుడు లింగమార్పిడి ఆపరేషన్‌తో స్త్రీగా మారాడు. ఇప్పటి వరకు బాగానే…
తనతో మాట్లాడటం మానేసిన మహిళ ఫ్లాట్‌కు నిప్పంటించాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. కాగా.. ఆ వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ ధకేటా (32) అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. అదే సమయంలో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లోకి చొరబడ్డాడని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ కెపి యాదవ్ తెలిపారు.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో…
Heart Attack: ఇటీవల కాలంలో యువకులతో పాటు టీనేజ్‌లో ఉన్న యువకులు కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో క్లాస్ వింటూనే గుండెపోటుతో కూలిపోయాడు ఓ విద్యార్థి.
Indore T20 Records Ahead Of IND vs AFG 2nd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. స్టార్లతో నిండిన టీమిండియాకు ఇది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు…
ఇదిలా ఉంటే దేశంలోనే అత్యంత మురికి నగరంగా పశ్చిమబెంగాల్ లోని హౌరా నగరం నిలిచింది. లక్ష కన్నా ఎక్కువ జనాభా ఉన్న 10 మురికి నగరాలు పశ్చిమబెంగాల్ లోనే ఉన్నాయి.
Indore: దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మరోసారి ఇండోర్ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 అవార్డుల్లో భాగంగా ఏడోసారి ఇండోర్ మొదటిస్థానంలో నిలిచింది. ఇండోర్, సూరత్ నగరాలు దేశంలో పరిశుభ్రమైన నగరాలుగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.