Indore: సాధారణంగా ఏ ఇంట్లో అయిన పిల్లలు ఎక్కువ సేపు టీవీ చూసినా, మొబైల్‌తో కాలక్షేపం చేసిన తల్లిదండ్రులు తిట్టడం, హెచ్చరించడం కామన్. అయితే, మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఇలాగే తల్లిదండ్రులు తమ కూతురు, కొడుకుని తిట్టారు. ఆ తర్వాత తమపై పోలీస్ కేసు నమోదైందని ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఆ తల్లిదండ్రుల వంతైంది. ఈ గొడవ కోర్టుకు కూడా చేరింది. ఈ ఘటన అక్టోబర్ 25,2021లో జరిగింది. దంపతుల కుమార్తె(21), కుమారుడు(8) నగరంలోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ తల్లిదండ్రులు తమను కొట్టారని ఆరోపించారు.
Read Also: Success Story: ఇస్రోకు నో చెప్పి.. రూ.52 లక్షల కొలువు పట్టేసింది.. రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ..
ఇదే కాకుండా తల్లిదండ్రులపై ఏడేళ్ల వరకు శిక్ష పడే అభియోగాలను మోపారు. IPC సెక్షన్లు 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 294 (అసభ్యకరమైన మాటలు చెప్పడం), 506 (నేరపూరిత బెదిరింపు), మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం), అలాగే సెక్షన్లు 75 (పిల్లల పట్ల క్రూరత్వం) మరియు జువెనైల్ జస్టిస్ చట్టం యొక్క 82 (శారీరక శిక్ష) కింద కేసులు నమోదు చేశారు.
తల్లిదండ్రుల తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది ధర్మేంద్ర చౌదరి తన వాదనల్ని వినిపిస్తూ, హైకోర్టు విచారణపై మధ్యంతర స్టే ఇచ్చారని చెప్పారు. తల్లిదండ్రులు కేవలం సాధారణ క్రమశిక్షణను పాటించారని, అన్ని ఇళ్లలో కూడా పిల్లలు ఎక్కువ సేపు మొబైల్ చూడటం, టీవలు చూడటం వంటివి చేస్తే మందలించడం సాధారణంగా జరుగుతుందని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు ఆయన వాదించారు. పిల్లలు మొబైల్, టీవీలకు అలవాటు పడిన ప్రతీ ఇళ్లు కూడా ఇబ్బంది పడుతోందని, పిల్లల్ని తిట్టడం మామూలే అని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల్ని కోర్టుకీడ్చినప్పటి నుంచి పిల్లలు ఇద్దరూ వారి అత్త వద్ద నివసిస్తున్నారు.