Indore: 10 లక్షలకు పైగా మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన అభ్యర్థి.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్య భారత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని 29 లోక్సభ స్థానాల్లో ఇండోర్ లోక్సభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లాలో చాలా విశాలమైనది. ప్రస్తుతం.. శంకర్ లాల్వానీ ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఇండోర్ స్థానం నుంచి బీజేపీ ఘన విజయం సాధించారు. ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ ఏకంగా 10,080,77 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆయనకు మొత్తం 12,267,51 ఓట్లు వచ్చాయి.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- 6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్ఫోన్ లాంచ్..!
- Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
- How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
- Apple మొట్టమొదటిసారిగా టచ్స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
అయితే ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ.. రికార్డు స్థాయి విజయం సాధించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థి.. నామినేషన్ విత్ డ్రా చేసుకునే చివరి రోజు నామ పత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రధాన ప్రతిపక్షం ఎవరూ లేకుండా పోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. ఇండోర్ నియోజకవర్గంలో బీజేపీకి కాకుండా నోటాకు ఓటు వేయాలని.. ఎన్నికల ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే నోటాకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. కాగా.. ఇండోర్ నియోజకవర్గంలో రెండో స్థానంలో నోటా ఉండటం గమనార్హం. ఇండోర్లో నోటాకు 2,186,74 ఓట్లు పడ్డాయి. నోటా చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు పడటం ఇదే తొలిసారి. దీంతో అత్యధిక ఓట్ల మెజార్టీతోపాటు నోటాకు అత్యధిక ఓట్లు పడిన ఒకే ఒక నియోజకవర్గంగా ఇండోర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇండోర్ నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీలో నిలవగా.. ఎవరూ శంకర్ లాల్వానీ దరిదాపుల్లో కూడా రాలేదు.
తాజావార్తలు
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్ఫోన్ లాంచ్..!
-
2027 Kawasaki Z900: Kawasaki Z900 బైక్ భారత్ లో లాంచ్.. 5-ఇంచ్ TFT డిస్ప్లే, 948cc ఇంజిన్, ధర, ఫీచర్లు ఇవే
-
Cyclone Arnab: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, బాధితులతో ముఖాముఖి!
-
How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
-
Apple మొట్టమొదటిసారిగా టచ్స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
ట్రెండింగ్
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి