CM Revanth Reddy: భూభారతి పేద రైతులకు చుట్టం.. అవగాహన సదస్సులు నిర్వహించాలి
- భూభారతి పేద రైతులకు చుట్టం
- 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారింది.. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించాం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు.
Also Read:Kyoro Electric Auto: బడ్జెట్ ధరలో క్యోరో ఎలక్ట్రిక్ ఆటో విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 200KM రేంజ్
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి.. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి.. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలి.. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి.. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి.. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి.. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి.. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు.. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి.. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read:Nepal: వివాహ వేడుకకు హాజరైన అనుకోని అతిథి.. వీడియో వైరల్..!
ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది.. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.. పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి.. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టండి.. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి.. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోండి.. భూభారతి పేద రైతులకు చుట్టం.. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయండి.. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
Also Read:Nepal: వివాహ వేడుకకు హాజరైన అనుకోని అతిథి.. వీడియో వైరల్..!
ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం.. క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంది.. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి.. మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలి.. ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి.. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండి.. క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలి.. 29, 30 తేదీల్లో జిల్లాల.. ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలి.. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలి.. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!