India's Defence Exports: భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ గా మారాలని భావిస్తోంది. సొంతంగా ఆయుధాలు, రక్షణ రంగ పరికరాలను తయారు చేసుకుంటోంది. గత కొన్నేళ్ల వరకు భారత్ తన రక్షణ రంగ అవసరాల కోసం ఎక్కువగా రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలపై ఆధారపడుతూ వచ్చింది. అయితే గత కొన్నేళ్లుగా భారత్ సొంతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే కాకుండా మనదేశంలో తయారైన రక్షణ పరికరాలను ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.