H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు H-1B వీసా విధానంపై అనేక కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాడు. H-1B వీసాల ద్వారా విదేశీయులు, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
India US: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ మరో వార్త సంచలనంగా మారింది. అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ సర్కార్ బహిష్కరిస్తోంది. ఇప్పటికే, ఫిబ్రవరి 05న 104 మంది భారతీయులను యూఎస్ మిలిటరీ విమానంలో అమృత్‌సర్‌కి తరలించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరో విడత బహిష్కరణ మొదలైనట్లు తెలుస్తోంది. రెండో విడత భారతీయులతో శనివారం(ఫిబ్రవరి 15)న మరో విమానం అమృత్‌సర్ వస్తున్నట్లు తెలుస్తోంది.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు తీసుకున్నారు. వచ్చీ రాగానే ఆయన గత పాలకుడు జో బైడెన్ నిర్ణయాలను రద్దు చేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉంటే, తన ఎన్నికల హామీల్లో కీలకమైన ‘‘బర్త్ రైట్ పౌరసత్వం’’ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. దీంతో ముఖ్యంగా విదేశాల నుంచి అమెరికా వెళ్లిన వారికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా భారతీయ వలసదారులకు ఈ పరిణామం మింగుడుపడటం…