Proddatur Dussehra : దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిండిపోయి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ఈ అపూర్వ ఉత్సవాన్ని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ఈ డాక్యుమెంటరీని నిర్మాత…
ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్‌పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో వందల ఏళ్లుగా పండగను జరుపుకోవడం లేదు. దీనంతటికి ఓ ‘‘సతి’’ శాపమే కారణం. ఒక మహిళన తన భర్త చితిలో దూకి నిప్పటించుకుని శపించినప్పటి నుంచి,
అంతరిక్షంలోకి తన చారిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. తన తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన ఆయన.. వీడియో కాల్‌లో తన కుటుంబానికి ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని సందేశం ఇచ్చారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వీడియో కాల్‌లో వర్చువల్‌గా తినిపించారు. చాలా మంది భారతీయులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు…
త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. "మద్యం తాగి మా గుడి లోపట రావద్దు" అని అందులో రాయాలన్నారు.
Grand Welcome : ఇంటికి కొత్త అతిథి రాక అనేది ఎంతటి ఆనందాన్ని తెస్తుందో అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఆరోగ్యంగా జన్మించినప్పుడు, ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక కుటుంబంలో దాదాపు 56 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల జన్మించినప్పుడు, ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దే లేదు. ఈ కథ ఒక అలాంటి అద్భుతమైన సంఘటన గురించి.. వారు ఆ చిన్నారిని మొదటి సారి ఇంట్లోకి ఆహ్వానించిన తీరు అందర్ని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో…
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారు..? అనే ప్రశ్న అందరి…
లాడ్ బజార్ వ్యాపారుల ఉదారత చాటుకున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల దగ్గర వ్యాపారులు డబ్బులు తీసుకోలేదు. మిస్ వరల్డ్ పోటీదారులు కొనుగోలు చేసిన వస్తువులను ఉచితంగానే అందజేశారు. డబ్బులు తీసుకునేందుకు వ్యాపారుల నిరాకరించారు. హైదరాబాద్ విశిష్టతను చార్మినార్ లాడ్ బజార్ ప్రత్యేకతలను ప్రపంచవ్యాప్తంగా తమ దేశాల్లో చాటాలని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను కోరారు. మిస్ వరల్డ్ ప్రతినిధులకు తమ షాపుల్లోకి గులాబీ పూలు ఇచ్చి ఆహ్వానించారు.
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం.
Republic Day : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న కర్తవ్య పథ్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దీనితో పాటు 21 తుపాకుల గౌరవ వందనం ఇవ్వబడుతుంది. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. భారతదేశ అభివృద్ధి, శక్తిని ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. అయితే 21 గన్ సెల్యూట్ ఇచ్చే సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇందులో నిజంగా 21 తుపాకులను ఉపయోగిస్తారా? సెల్యూట్‌లో ఏ ఫిరంగిని ఉపయోగించారో…