అంతరిక్షంలోకి తన చారిత్రాత్మక ప్రయాణానికి కొన్ని గంటల ముందు.. తన తల్లిదండ్రులతో శుభాంశు శుక్లా మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లే స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌకలో ఎక్కడానికి సిద్ధమైన ఆయన.. వీడియో కాల్‌లో తన కుటుంబానికి ‘నా కోసం వేచి ఉండండి. నేను వస్తున్నా’ అని సందేశం ఇచ్చారు. శుభాంశు తల్లి చక్కెర, పెరుగు కలిపిన పదార్థాన్ని ఆయనకు వీడియో కాల్‌లో వర్చువల్‌గా తినిపించారు. చాలా మంది భారతీయులు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు ఆచరించే సంప్రదాయంలో ఇదీ ఒకటి. ఇలా తినిపిస్తే.. అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు.
READ MORE: Tamil Nadu: ఆస్తి పంపకాల్లో తండ్రీకూతుళ్ల మధ్య వివాదం.. ఆలయానికి రూ. 4 కోట్ల విరాళం..!
శుభాంశు రోదసియాత్రపై ఆయన తల్లి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మాకు ఎంతో గర్వంగా ఉంది. మేము ఏమాత్రం భయపడటం లేదు. శుభాంశుని వెళ్లి మిషన్ పూర్తి చేయమని చెప్పామని వెల్లడించారు. “ఇవి కన్నీళ్లు కాదు.. ఆనంద బాష్పాలు.. బహుశా శుభాంశు చాలా దూరం వెళ్తున్నాడు కాబట్టి అమ్మ భావోద్వేగానికి గురైంది.” అని అతని సోదరి చెప్పింది.
READ MORE: Preethi Mukundan : కన్నప్ప హీరోయిన్ ప్రీతి ముకుందన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
కాగా.. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. 28 గంటల ప్రయాణం తర్వాత.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. 14 రోజుల పాటు వీరు అక్కడే ఉంటారు.