Bengaluru: బెంగళూర్‌లో ఓ విద్యార్థి ‘‘ఆజాద్ కాశ్మీర్’’ మ్యాప్, జెండా ఉన్న టీషర్టును ధరించడం చర్చకు దారి తీసింది. నగరంలోని అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితుడిని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఇనాయత్ అమీన్‌గా గుర్తించారు. వివాదాస్పద టీషర్టు ధరించిన అమీన్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. Read Also: Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి.. వీడియోలో కనిపిస్తున్న బైక్…
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్‌లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
New Criminal Laws: నేటి నుంచి దేశ న్యాయ వ్యవస్థలో పెనుమార్పు వచ్చింది. బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న IPC, CrPC, ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ఇప్పుడు మారిపోయింది. ఇవి ఇప్పుడు ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా భర్తీ చేయబడ్డాయి.
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి.
New Criminal Laws: బ్రిటీష్ కాలపు వలస చట్టాల స్థానంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 న్యాయ చట్టాలను తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత-2023 శతాబ్ధం నాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) స్థానంలో రాబోతోంది. జూలై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త చట్టం ఐపీసీని 511 నుంచి 358 సెక్షన్లకు తగ్గించి, 20 నేరాలను జోడించింది. క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది.
New Criminal Laws: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం శనివారం తెలిపింది. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) స్థానంలో ఈ చట్టాలు అమలు చేయబడుతాయి.
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో గత వారం శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తికావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కేసు దర్యాప్తుపై పడింది.