Student Missing: లండన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. ముప్కాల్ మండలం రెంజర్లకు చెందిన అనురాగ్ రెడ్డి లండన్ లో ఈ నెల 25వ తేదీన అదృశ్యం అయ్యాడు. కార్దీప్ ప్రాంతానికి స్నేహితులతో కలిసి వెళ్ళి అదృశ్యమైయ్యాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య దౌత్య స్థాయిలో సంబంధాలపై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. దానికి కారణమేమిటంటే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గీతిక శ్రీవాస్తవ పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై దాడుల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. భారతీయ దౌత్య సంస్థల భద్రత సమస్యపై చర్చించారు. భారతదేశ వ్యతిరేక అంశాలకు వ్యతిరేకంగా బలమైన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.
UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్‌లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా హౌస్ ఆఫ్ కామన్స్ నాయకుడిని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
గతవారం బ్రిటన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం దగ్గర ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోయారు. భారత హైకమిషన్ కార్యాలయంపై ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. దీంతో మరో భారీ పతాకాన్ని అప్పటికప్పుడు తెచ్చి కమిషన్ కార్యాలయంపై ప్రదర్శించారు.
UK: విదేశాల్లో ఉంటున్న ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో భారత వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు గత రెండు రోజులుగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతని అనుచరులు, బాడీగార్డులను కలిపి 78 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీసుకుంటున్న ఈ చర్యలపై విదేశాల్లో కూర్చుని ఉన్న ఖలిస్తానీ మద్దతుదారులకు నచ్చడం లేదు.
భారత్‌పై పాకిస్థాన్ ఎప్పుడూ ఏదో ఓ కుట్రలకు పాల్పడుతూనే ఉంటుంది.. పాక్ ఉగ్ర సంస్థలు కొత్త తరహాలో భారత్‌పై టార్గెట్ చేయడం.. వాటిని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతూనే ఉంది.. కొన్ని సమయాల్లో ప్రాణ నష్టం తప్పని పరిస్థితి.. గత కొంతకాలంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు విహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌పైన కూడా డ్రోన్ల దాడి జరిగింది. ఎయిర్‌బేస్‌పై జరిగిన డ్రోన్ దాడిలో పాక్‌కు చెందిన ఉగ్ర సంస్థలు జేషే…