Helpline Number: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శ్రమిస్తున్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయంలో బుధవారం అధికారులు, మంత్రులు సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమగ్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యపై ప్రాథమిక సమాచారం అందించిన అధికారులు, నేపాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 241 మంది తెలుగువారూ చిక్కుకుపోయారని తెలిపారు. Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..! సమాచారం…
US Deports: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆరు నెలల్లో 1,563 మంది భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపించారని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. మొత్తం 15,000 మందికి పైగా భారతీయులు ఇప్పటివరకు బహిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 20 నుంచి జూలై 15 మధ్య కాలంలో 1,563 మంది భారతీయులు అమెరికా నుంచి భారతదేశానికి పంపించబడ్డారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్…
అమెరికా ప్రభుత్వం ఇటీవల విదేశీ విద్యార్థులపై చర్య తీసుకుంది. స్టూడెంట్ వీసా హోల్డర్లను గుర్తించి, పరిశీలించడానికి “క్యాచ్ అండ్ రివోవల్” కార్యక్రమాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. ఇందులో యూదు వ్యతిరేకత లేదా పాలస్తీనియన్లు, హమాస్‌కు మద్దతు ఇచ్చే ఆధారాల కోసం వారి సోషల్ మీడియాను పర్యవేక్షించడం కూడా ఉంది. ఈ చర్య తర్వాత, చాలా మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వారిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అమెరికన్ లాయర్స్ అసోసియేషన్…
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.