US Deports: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఆరు నెలల్లో 1,563 మంది భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపించారని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. మొత్తం 15,000 మందికి పైగా భారతీయులు ఇప్పటివరకు బహిష్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 20 నుంచి జూలై 15 మధ్య కాలంలో 1,563 మంది భారతీయులు అమెరికా నుంచి భారతదేశానికి పంపించబడ్డారని విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తెలిపారు. వీరిలో చాలామంది వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు.
Pavel Durov: భవిష్యత్‌పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!
డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత, తన ప్రధాన ఎన్నికల హామీల్లో ఒకటైన అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని కార్యరూపం దాల్చారు. ఇందులో భాగంగా, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై సామూహిక బహిష్కరణకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా అమెరికాలో ఉన్న భారతీయుల విషయంలో, అమెరికా ప్రభుత్వంతో భారత్ పరస్పరంగా సహకరించిందని కేంద్రం స్పష్టం చేసింది. భారతీయుల పౌరసత్వం ధృవీకరణ అనంతరం, వారిని తిరిగి స్వీకరించడం దేశ బాధ్యతగా భావిస్తామని కేంద్రం తెలిపింది.
Supreme Court: 12 ఏళ్ల చిన్నారి కథ విని చలించిన సుప్రీంకోర్టు.. తప్పును అంగీకరించిన న్యాయస్థానం..
బహిష్కరణ చర్యలతోపాటు.. వీసా పొందిన తరువాత కూడా స్క్రీనింగ్ కొనసాగుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఒక్క తప్పిదంతో కూడా వీసా రద్దయ్యే అవకాశముందని హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం ఇలినాయిస్ లోని టార్గెట్ స్టోర్ లో రూ.1.1 లక్షల విలువైన వస్తువులు దొంగిలించిన భారతీయ మహిళ అరెస్ట్ కావడంతో అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. దొంగతనం, దాడి లేదా చోరీ వంటి నేరాలు చేయడం వలన వీసా రద్దు అయ్యే మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అమెరికా వీసాలకు అనర్హత వస్తుందని అమెరికా ఎంబసీ తెలిపింది. విదేశీ సందర్శకులు స్థానిక చట్టాలను గౌరవించాలని, నేరాలకు పాల్పడవద్దని సూచించింది.