K.A. Paul: యెమెన్లో మరణశిక్ష నుంచి తప్పించుకున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియ జూలై 16న చనిపోవాల్సింది. జూలై 14 న సుప్రీం కోర్టులో నిమిషను కాపాడలేక పోయాం అని కేంద్రం చెప్పింది. కానీ మొత్తానికి ఆమెను మరణ శిక్ష నుంచి తప్పించాం. కానీ నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొన్ని శక్తులు ఆమె విడుదలను ఆపించారని…
Jai Shankar: జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ ఉగ్రదాడి చేశారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇది ‘‘ఆర్థిక యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇస్లామాబాద్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదానికి ప్రతిస్పందించకుండా భారత్‌ని ఎవరూ అడ్డుకోలేరని వెల్లడించారు. న్యూయార్క్‌లో న్యూస్‌వీక్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
భారతదేశం మరోసారి విదేశీ గడ్డపై తన దౌత్య మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తమ పౌరులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్ భారతీయ విద్యార్థుల కోసం టెహ్రాన్ తన గగనతలాన్ని తెరిచింది.
మే 6-7 రాత్రి.. ప్రపంచం మొత్తం నిద్రపోతోంది. భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో బిజీగా ఉంది. 30 నిమిషాల ఆపరేషన్‌లో భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉదయం వరకు దీని గురించి ఎవరికీ అధికారిక సమాచారం లేదు. ఇంతలో ఈ ఘటనపై సైన్యం, విదేశాంగ శాఖ సంయుక్త విలేకరుల సమావేశంలో సమాచారం అందించారు. సుమారు 10.30 గంటలకు ఒక వ్యక్తి విలేకరుల సమావేశంలో కనిపించారు. ఆయనతో పాటు భారత…