సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ప్రభుత్వం అనుమతించదనిసమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ఓటీటీ ప్రతినిధులతో అన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో ఇక్కడ జరిగిన సమావేశంలో అనురాగ్ ఠాకూర్ ఈ విషయం చెప్పారు.
కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ఆయన ప్రశ్నించారు
Samosa and Tea: మధ్యాహ్నం భోజనం చేసినా.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పక్కాగా టీ తాగాల్సిందే.. ఇక, అంతకు ముందే.. సమోసానో.. భజ్జీలో.. బోండాలో.. పునుగులో ఇలా ఏవో ఒకటి.. అక్కడ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి లాగించేస్తుంటారు.. వీటిలో ఎక్కువ ప్రియోర్టీ మాత్రం సమోసాకే ఉంటుంది.. వేడి వేడి టీకి ముందు సమోసా తింటే ఆ కిక్కే వేరు.. ఇది కేవలం మన దేశానికి పరిమతం కాలేదండోయో.. ఇది ఇతర దేశాలకు కూడా పాకేసింది.. చాయ్, సమోసా…
సీమంతం అంటే మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమయిన ఘట్టం. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే ఘట్టం సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త ఎన్నో నియమాలు పాటించాలి. ఆరవనెల గాని, ఎనిమిదవ నెలలో గానీ సీమంతం జరుపుతుంటారు. ఏ శుభకార్యాల్లో లేని విధంగా సీమంతంలో గాజులు తొడిగి పండంటి బిడ్డను ఇమ్మని ఆశీర్వదిస్తారు. అలా గాజులు ఎందుకు తొడుగుతారంటే…
కొంత కాలంగా మన దేశంలో ఆహార అలవాట్లను కూడా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన నవరాత్రి సందర్బంలోనూ దానిని చూశాం. పర్వదినాలలో దేశ వ్యాప్తంగా మాంసం దుకాణాలు మూసివేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లలో మాంసాహారం అందుబాటులో ఉంచరాదని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే, ప్రగతిశీల వాదులు దానిని కౌంటర్ చేస్తున్నారు. మాంసాహారం పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉత్తర, మధ్య భారత్‌లో కనిపిస్తుంది. అక్కడ ఈ అంశాన్ని ఒక సమస్యగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.…
హక్కులను పొందడం కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నదే రామావతార సందేశం అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిదన్నారు. శ్రీ కొమాండూర్ శశికిరణ్ రాసిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు.మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. శ్రీరాముడి జీవిత గాధ నుంచి…