Samosa and Tea: మధ్యాహ్నం భోజనం చేసినా.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. పక్కాగా టీ తాగాల్సిందే.. ఇక, అంతకు ముందే.. సమోసానో.. భజ్జీలో.. బోండాలో.. పునుగులో ఇలా ఏవో ఒకటి.. అక్కడ అందుబాటులో ఉన్నదాన్ని బట్టి లాగించేస్తుంటారు.. వీటిలో ఎక్కువ ప్రియోర్టీ మాత్రం సమోసాకే ఉంటుంది.. వేడి వేడి టీకి ముందు సమోసా తింటే ఆ కిక్కే వేరు.. ఇది కేవలం మన దేశానికి పరిమతం కాలేదండోయో.. ఇది ఇతర దేశాలకు కూడా పాకేసింది.. చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరిగిపోయిందట.. యునైటెడ్ కింగ్‌డమ్ టీ అండ్ ఇన్‌ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఇది బయటకి వచ్చింది.
Read Also: Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..
వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహించింది యునైటెడ్ కింగ్‌డమ్ టీ అండ్ ఇన్‌ఫ్యూజన్స్ అసోసియేషన్.. సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ (ఓట్స్‌తో చేసేది) బాగుంటుందని ఎక్కువ మంది చెప్పుకొచ్చారు.. ఇక, ఆ తర్వాత స్థానం మన సమోసాదే.. ఈ సర్వేలో పాల్గొన్న యువతలో 8 శాతం మంది సమోసాకి ఓటు వేశారు.. ఇక, దీనిపై ఆనందం వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. యునైటెడ్ కింగ్‌డమ్ పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ఆనందంగా ఉందంటూ.. ట్వీట్ చేశారు.. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.. 16-24 ఏళ్ల మధ్య ఏజ్‌వారిలో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.. #indianculture #foodie #uk #india హాష్ ట్యాగ్‌లను జోడించి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి..
It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023