Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది.