భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. తనకు కాబోయే భర్తతో ఎంగేజ్‌మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాబోయే వధూ వరులు పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. అలాగే ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. కాగా.. ఆ ఫోటోలను పీవీ సింధు ఈరోజు (శనివారం) సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.