Indian Fighter Jets: భారత్ తేజస్ MK-2 ముందు పాక్ F-16 జుజుబీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Fighter Jets: తేజస్ ఫైటర్ జెట్.. ఇది నిజంగా మామూలు ఫైటర్ జెట్ కాదయ్యా. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ముందు వరుసలో నిలిచే విమానం. ఇప్పటికే భారతదేశం తేజస్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక రకాల యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది. తేజస్ ప్రాజెక్టును కార్యరూపం దాల్చడానికి HAL విశేష కృషి చేస్తోంది. తేజస్ జెట్‌లో అనేక రకాల సాంకేతికతలు, ఆయుధ వ్యవస్థలను అనుసంధానిస్తున్నారు. ఇది ప్రస్తుత అధునాతన విమానాల కంటే చాలా ఎక్కువ ప్రాణాంతక సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నట్లు సమాచారం. తేజస్ కొత్త రకం యుద్ధ విమానం ముందు పాకిస్థాన్ F-16 చాలా వెనుకబడి ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికన్ F-16 కంటే మన తేజస్ కొత్త వెర్షన్ చాలా శక్తివంతమైనదిగా ఉండనుంది. తేజస్ ఫైటర్ జెట్ 4.5-తరం ఫైటర్ జెట్, కానీ దాని కొన్ని లక్షణాలు ఐదవ తరం జెట్‌ను పోలి ఉంటాయని చెబుతున్నారు. ఇక తేజస్ కన్ను పడిన చోట బుడిద కావాల్సిందే అని అంటున్నారు.
READ ALSO: Idiot : ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్.. అది చేసుంటే వేరే లెవల్..
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్‌మ్యాన్’ కెరీర్‌పై తొలి కోచ్ రాజ్‌పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్‌లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
5వ తరం జెట్ అభివృద్ధికి మొదలైన ప్రాజెక్టు..
భారతదేశం ఇప్పటికే తేజస్ ఐదవ తరం జెట్‌ను అభివృద్ధి చేయడానికి AMCA ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా నిరంతరం తన ఫైటర్ జెట్‌లను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం భారత్ దేశ రక్షణ వ్యవస్థదాన్ని బలోపేతం చేయడంలో బిజీగా ఉంది. స్వదేశీ తేజస్ యుద్ధ విమాన కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తేజస్ Mk-2 (MWF – మీడియం వెయిట్ ఫైటర్) గురించి రక్షణ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. దీని మొదటి నమూనా 2025 చివరి నాటికి సిద్ధంగా ఉండవచ్చని, మొదటి విమానం 2026 ప్రారంభంలో కానున్నట్లు సమాచారం. ఉత్పత్తి 2029లో ప్రారంభమవుతుంది, 2032 నుంచి ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళానికి డెలివరీకి అవుతాయని అంచనా. 2034 నాటికి 120 యూనిట్లను వైమానిక దళంలో చేర్చడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. GE ఇంజిన్ సరఫరా, స్వయం సమృద్ధి జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజిన్ సరఫరా భారతదేశానికి చాలా కీలకంగా మారింది. స్థానిక ఇంజిన్ ఉత్పత్తికి సంబంధించి HAL, GE ఏరోస్పేస్ మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని ఇటీవలి నివేదికలు వచ్చాయి. ఈ ఒప్పందం మంచి ఫలితాలు ఇస్తే, భారతదేశం ఉత్పత్తి గడువులను చేరుకోవడమే కాకుండా, దిగుమతిపై ఆధారపడటాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మామూలుగా లేవు కదా తేజస్ MK-2 ప్రత్యేకతలు..
Mk-2 ఎయిర్‌ఫ్రేమ్ Mk-1ల కంటే పెద్దదిగా ఉండటంతో పాటు, దగ్గరగా జతచేసిన కానార్డ్‌లను కలిగి ఉంటుంది. దీని ద్వారా దాని పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇది అమెరికన్ జనరల్ ఎలక్ట్రిక్ F-414 ఇంజిన్ ద్వారా శక్తిని పొందనుంది. ఈ ఇంజిన్ తేజస్ ఫైటర్‌కు ఎక్కువ వేగం, పేలోడ్ సామర్థ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు. స్వదేశీ ఏవియానిక్స్, అధునాతన AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు ఈ ఫైటర్ జెట్‌ను అత్యాధునికంగా చేస్తాయని పేర్కొంటున్నారు. ఈ యుద్ధ విమానం తయారీలో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 82% కంటే ఎక్కువ స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తుందని, అది క్రమంగా 90% కంటే ఎక్కువ పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఇంజిన్ ఉత్పత్తి లైసెన్స్ పొందిన తర్వాత ఈ లక్ష్యం మరింత పెరగనున్నట్లు సమాచారం.
తేజస్ Mk-1A వెర్షన్ ఇప్పటికే ఉత్పత్తిలో ఉంది. ఇది Mk-1 కంటే మెరుగైనది. ఈ యుద్ధ విమానం ఆధునిక ఏవియానిక్స్, స్వదేశీ రాడార్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను కలిగి ఉంటుంది. ఈ యుద్ధ విమానం వైమానిక దళం సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. తేజస్‌కు ఒక ప్రధాన హైలైట్ మెటిలియర్ BVRAAM (బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్) ఏకీకరణ అని అంటున్నారు. ఈ క్షిపణి తేజస్‌కు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని అందజేయనుంది. దీని వేగం, సుదూర పరిధి నో-ఎస్కేప్ జోన్‌తో ఈ క్షిపణి తేజస్ Mk-1A, Mk-2 రెండింటికీ గేమ్-ఛేంజర్‌గా మారబోతుందనడంలో సందేహం లేదంటున్నారు. దీని రాకతో భారత వైమానిక దళం ఆధిపత్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని అంటున్నారు.
ఆస్ట్రా-2 క్షిపణికి అద్భుతమైన రాడార్ శక్తి
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన GaN-ఆధారిత AESA రాడార్ తేజస్‌కు వెన్నెముకగా నిలువనున్నట్లు సమాచారం. ఈ రాడార్ దీర్ఘ-శ్రేణి లక్ష్య గుర్తింపు, బహుళ-లక్ష్య ట్రాకింగ్ కలిగి ఉండనుంది. ఆస్ట్రా-2 క్షిపణిని దీనితో అనుసంధానించడం వలన తేజస్ వైమానిక పోరాట సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు. ఆస్ట్రా-2 క్షిపణి మెరుగైన పరిధి, అధునాతన సీకర్ సాంకేతికతను కలిగి ఉండటంతో, శత్రు యుద్ధ విమానాలకు గట్టి సవాలును విసురుతుందంటున్నారు.
తేజస్ vs చైనీస్ స్టెల్త్ ఫైటర్స్
చైనా J-20, ఇతర స్టెల్త్ ఫైటర్లను అభివృద్ధి చేసింది. తేజస్ Mk-1A, Mk-2 యుద్ధ విమానాలు వీటితో పోటీ పడగలవని రక్షణ నిపుణులు విశ్వసిస్తున్నారు. Mk-2 రాడార్ క్రాస్-సెక్షన్ తగ్గుతుంది, ఇది పాక్షికంగా స్టెల్త్‌గా మారుతుందని చెబుతున్నారు. ఈ యుద్ధ విమానాలు భారతదేశ వైమానిక యుద్ధ వ్యూహాన్ని సమతుల్యం చేస్తాయని చెబుతున్నారు.
READ ALSO: Maldives Tourism Threat: మాల్దివులు మాయం కానుందా? ముప్పు ముంగిట ప్రముఖ పర్యాటక ప్రాంతం!
తాజావార్తలు
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్‌మ్యాన్’ కెరీర్‌పై తొలి కోచ్ రాజ్‌పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!