Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Airtel Launches Fraud Detection Solution For Whatsapp Emails

Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం..

NTV Telugu Twitter
Published Date :May 16, 2025 , 7:02 pm
By Chandra Shekhar
  • సైబర్‌ నేరాలకు అడ్డుకునేందుకు ఎయిర్‌టెల్‌ కొత్త సదుపాయం..
  • ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఎయిర్‌టెల్‌..
  • వాట్సాప్, ఈ-మెయిల్స్‌ ద్వారా జరిగే సైబర్‌ మోసాలను అడ్డుకోనున్న సెక్యూరిటీ సిస్టమ్‌..
Airtel: ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Airtel: సైబర్‌ నేరాలకు అడ్డుకునేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ఇప్పటికే తగిన చర్యలు చేపట్టిన ఆ కంపెనీ.. తాజాగా సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టడానికి ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్‌ ద్వారా జరిగే సైబర్‌ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్‌ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్‌టెల్ వినియోగదారులను సైబర్‌ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్‌ కాపాడనుంది. కాగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాయంతో ఇది పని చేయనుంది. మనకొచ్చే లింక్స్‌ను క్లిక్‌ చేసినప్పుడు ఈ సిస్టమ్‌ దాన్ని పూర్తిగా చెక్‌ చేస్తుంది. ఒకవేళ సైబర్‌ మోసాలకు అవకాశం ఉన్న మోసపూరిత లింక్‌ అయితే.. దాన్ని ఓపెన్‌ కాకుండా ఈ ఫీచర్‌ వెంటనే బ్లాక్‌ చేస్తుంది. ఒకవేళ ఆ లింక్‌ సురక్షితమని భావిస్తే తక్షణమే ఆ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. అయితే, సైబర్‌ నేరాలు పెరుగుతుండటంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

Read Also: Balochistan: ‘‘దమ్ముంటే క్వెట్టా దాటి బయటకు రండి’’.. పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న బీఎల్ఏ..

కాగా, మొబైల్‌ బ్రౌజర్‌, ఈ-మెయిల్‌, ఎస్ఎంఎస్, వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా తదితర యాప్స్‌ వేదికగా ఈ ఫ్రాడ్ డిటెక్షన్ పని చేయనుంది. ఎయిర్‌టెల్‌ మొబైల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు ఆటోమేటిక్‌గా ఈ సదుపాయం ఎనేబుల్‌ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం హర్యానా సర్కిల్‌లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ వాడుతున్న వారికి ఇప్పటికే ఆటోమేటిక్‌గా స్పామ్‌ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు గుర్తించే సదుపాయం వర్క్ అవుతుంది. 10 భాషల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రాగా, ఇదే తరహాలో ఫ్రాడ్‌ డిటెక్షన్‌ సదుపాయం కూడా పని చేస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airtel
  • cyber crime
  • cyber security
  • Fraud Detection Solution
  • india

తాజావార్తలు

  • Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తులకు షాక్.. వ్రతం టికెట్ ధరలు భారీగా పెంపు..

  • Iran-Israel War: ఇరాన్‌లో భారీ నష్టం.. మిలటరీ చీఫ్ సహా అగ్ర నేతలంతా మృతి

  • Stock Market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

  • Air India Plane: లండన్‌ వెళ్తూ.. వెనక్కి వచ్చేసిన ఎయిర్‌ ఇండియా విమానం!

  • Ace OTT: 20 రోజుల్లోనే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ కొత్త సినిమా!

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions