ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం రక్షణ వ్యవస్థపై పోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో సైన్యానికి మరింత ప్రోత్సాహం అందించాలని కేంద్రం యోచిస్తోంది.
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. గురువారం పంజాబ్ ప్రావిన్స్‌లోని కమ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ సందర్శించారు.
భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్ తన త్రివిధ దళాల శక్తిని పాకిస్తాన్‌కి రుచిచూపించింది. పాక్‌తో పాటు దాని ఇద్దరు మిత్రులు చైనా, టర్కీలకు కూడా దెబ్బ తగిలింది. అయితే, మే 9-10 రాత్రిలో భారత్ పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లు లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించింది. 13 పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ సైన్యం నడ్డి విరిచింది. అయితే, ఈ ఆపరేషన్ నిర్వహించడానికి భారత్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ మంగళవారం ఉదయం పంజాబ్‌లోని ఆదంపూర్‌లో వాయుసేనను కలిసి ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రదర్శించిన తీరును కొనియాడారు.
Operation Sindoor: భారతదేశం ఇటీవల పాకిస్తాన్‌పై చేపట్టిన ‘‘ఆపరేషన్ సిందూర్’’కి భయపడిందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారతదేశం, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో ‘‘కాళ్ల మధ్య తోకతో భయపడిన కుక్కలా పాకిస్తాన్ కాల్పులు విరమణ కోసం ప్రయత్నించింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ ఫెలోగా ఉన్న రూబిన్ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఎలా భయపడిందనే విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ సైన్యం ఘోరంగా ఓడిపోయిందని అన్నారు.…
కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మంత్రిగా మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం మండిపడింది. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండని, ముందుగా హైకోర్టులో క్షమాపణలు చెప్పండని మంత్రి విజయ్…
UN-India: పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా (LeT) తో పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక కార్యాలయం (UNOCT), కౌంటర్-టెరరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (CTED) అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది. Read Also: Bob Blackman: పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం…