India Bangladesh: బంగ్లాదేశ్‌కి భారత్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి దిగుమతి అవుతున్న కొన్ని వస్తువులపై పోర్టు ఆంక్షలు విధించారు. ఆ దేశం నుంచి రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వంటి కొన్ని దిగుమతులపై ఆంక్షలు పెట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంపై నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే పరిమితం చేసింది.…
నరేంద్ర మోడీ పాలనలో భారత జాతి ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతుంది అని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందుతోంది.. ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది.. మా దేశ సమగ్రతను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే ఎవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని సంకేతాలు పాకిస్తాన్ కు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్టెల్ వినియోగదారులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడనుంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మన దేశం సాధించిన ఈ విజయంతో పాకిస్థాన్ నేతలు చిరాకుపడి.. తామే గెలిచామంటూ తమ డబ్బు తామే కొట్టుకుంది. తాజాగా ఉద్రిక్తత పరిస్థితుల అనంతరం భారత్‌ను కాపీ కొట్టడంలో పాకిస్థాన్ బిజీగా మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు సామేత ప్రస్తుతం పాకిస్థాన్‌కి బాగా అబ్బుతుంది.