భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని పదే పదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. గతంలో ఒకసారి ఇలా చెప్పగా.. తాజాగా మరోసారి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో సమావేశం సందర్భంగా అవే వ్యాఖ్యలు చేశారు.
Spy Jyoti Malhotra: పాకిస్తాన్కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీని పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా వాటిని ఆ డైరీలో రాస్తుంటుంది.
Turkey: పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది.
MR. Srinivasan: మాజీ అణు శాస్త్రవేత్త, అటామిక్ ఎనర్జీ కమీషన్ మాజీ చైర్మెన్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్ ఈరోజు ఉదయం తుది శ్యాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.
ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగుతుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్ ఇంగ్లాండ్ టూర్లో కఠిన సవాళ్లు ఎదుర్కోనుంది.