Ind vs Pak Water Emergency: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దాయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాల్లో నీటిమట్టం పడిపోవడంతో.. సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15 శాతం మేర తగ్గిపోయింది.
Jyoti Malhotra: పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలతో సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు ఈరోజు (జూన్ 9న) తొలిసారి కోర్టులో విచారణకు రాబోతుంది.
Pakistan: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
అమెరికా కొత్తగా విధించిన 10 శాతం బేస్లైన్ సుంకాన్ని తొలగించడమే కాకుండా.. జూలై 9 నుంచి ప్రతిపాదిత 16 శాతం అదనపు సుంకాన్ని కూడా అమలు చేయకూడదని భారత్ డిమాండ్ చేసింది. అమెరికా ఈ సుంకాలను తొలగించకపోతే, అమెరికన్ వస్తువులపై ప్రతీకార సుంకాలను కొనసాగించే హక్కు కూడా తమకు ఉంటుందని ఈ సమావేశంలో భారత ప్రతినిధులు తెలిపారు.
కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఏపీలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జీజీహెచ్లో చికిత్స కోసం వచ్చిన వారికి కొవిడ్ ఉన్నట్లు నిర్దారణ అయింది. Also Read: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి..…
India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది.
G7 Summit: కెనడాలోని అల్బెర్టాలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న జీ7 సమ్మిట్ కు భారతదేశానికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కెనడా ప్రధాని మార్క్ కార్నే ఫోన్ చేసి సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించారు.