దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
India China: చైనా-పాకిస్తాన్-బంగ్లాదేశ్ కలిసి దుష్ట పన్నాగాన్ని పన్నుతున్నాయి. భారత్ని చుట్టుముట్టేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇటీవల ఈ మూడు దేశాలు కలిసి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాకిస్తాన్తో త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం భారత్కి ఆందోళన కలిగించే విషయం.
గతంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరఫరా, డిమాండ్ సమతుల్యంగా ఉండేది. ఇటీవల కాలంలో ప్రీలాంచ్లు, బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది. దీంతో నిర్మాణం పూర్తై అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉంది. హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది.