భారత్ మంచి స్నేహితుడు అంటూనే ట్రంప్ భారీ బాదుడు బాదారు. ఊహించని రీతిలో సుంకం విధించారు. ఆసియా దేశాలన్నీ ఒకెత్తు అయితే.. భారత్పై మరొకలా టారిఫ్ విధించారు.
భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా వ్యవహరించడం నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. సామాన్యుడి దగ్గర నుంచి మేధావుల వరకు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత 25 శాతం టారిఫ్ పెంచగా.. రష్యాతో సంబంధం పెట్టుకున్నందుకు అదనంగా మరో 25 శాతం సుంకాన్ని ట్రంప్ పెంచారు. దీంతో పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిననున్నాయి.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోతున్నాయి. నిన్నామొన్నటిదాకా రెండు దేశాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.